ఒక్కొక్కసారి మనకు ముఖ్యమైన బ్యాంక్ పనులు ఉంటాయి. అయితే బ్యాంక్ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం మంచిది. ఎందుకంటే మధ్యమధ్యలో సెలవు రోజులు ఉంటాయి కాబట్టి పనులు వాయిదా వేయకుండా పూర్తి చేసుకోవడం ముఖ్యం.
అదే విధంగా ముందుగానే ఏ రోజులు బ్యాంకులు సెలవు వచ్చాయి అనేది తెలుసుకుంటే బ్యాంక్ పనులుకి ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకోవడానికి అవుతుంది. అయితే ఈ మార్చి నెలలో బ్యాంకు సెలవులు గురించి ఇప్పుడు చూద్దాం. మార్చి నెలలో ఏకంగా 13 సెలవులు వచ్చాయి.
దేశ వ్యాప్తంగా చూస్తే బ్యాంకులకు మొత్తం 13 సెలవులు ఉన్నాయి. వేర్వేరు రీజియన్స్ లో వేరు వేరు రోజులు బ్యాంకులు కి సెలవులు ఉన్నాయి. కాబట్టి వీటిని గమనించడం మంచిది. అదే ఒక హైదరాబాదులో అయితే ఎనిమిది సెలవులు వచ్చాయి ఇక సెలవు వివరాల్లోకి వెళితే…
మార్చి 1 మహాశివరాత్రి (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రడూన్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ, షిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం, హైదరాబాద్ లో సెలవులు)
మార్చి 3 లోసర్ (గ్యాంగ్‌టాక్)
మార్చి 4 చప్చార్ కుట్ (ఐజ్వాల్)
మార్చి 6 ఆదివారం (అన్ని చోట్ల సెలవులు)
మార్చి 12 రెండో శనివారం (అన్ని చోట్ల సెలవులు)
మార్చి 13 ఆదివారం (అన్ని చోట్ల సెలవులు)
మార్చి 17 హోళికా దహన్ (డెహ్రడూన్, కాన్పూర్, లక్నో, రాంచీ)
మార్చి 18 హోళీ (హైదరాబాద్, అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రడూన్, గ్యాంగ్‌టక్, గువాహతి, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పనాజీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, శషిమ్లా, శ్రీనగర్)
మార్చి 19 హోళీ మరుసటి రోజు సెలవు (భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నా)
మార్చి 20 ఆదివారం (అన్ని చోట్ల సెలవులు)
మార్చి 22 బీహార్ దివస్ (పాట్నా)
మార్చి 26 నాలుగో శనివారం (అన్ని చోట్ల సెలవులు)
మార్చి 27 ఆదివారం (అన్ని చోట్ల సెలవులు)