ఎస్బీఐ బంఫర్ ఆఫర్..లక్షల ప్రైజ్ మని గెలుచుకొనే అవకాశం..

-

ప్రముఖ వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐ కస్టమర్లకు వరుస గుడ్ న్యూస్ లను అందిస్తుంది..ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్స్ పై వడ్డీ రేట్లు పెంచిన విషయం తెలిసిందే..ఇప్పుడు మరో సువర్ణ అవకాశాన్ని అందిస్తుంది.ఇన్నోవేషన్ బ్యాంక్ 2022 హ్యాకథాన్‌ను ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంక్ ఎదుర్కొంటున్న సవాళ్లకు సాంకేతిక పరిష్కారం చూపేందుకు ఈ హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది..మెక్రోసాఫ్ట్‌తో కలిసి సంయుక్తంగా ఈ హ్యాకథాన్‌ను నిర్వహిస్తోంది. ఎస్బీఐ హ్యాకథాన్‌కు రూ.9,00,000 భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది.

ఈ హ్యాకథాన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి ఉన్న వారు మే 20, 2022 వరకు నమోదు చేసుకోవచ్చు. ఈ హ్యాకథాన్ ఇమేజ్, డాక్యుమెంట్ ఆప్టిమైజేషన్, వీడియో కంప్రెషన్, వాయిస్ బయోమెట్రిక్స్, ఐడెంటిఫికేషన్ అండ్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, వీడియో అనలిటిక్స్‌ వంటి 5 థీమ్స్‌పై ఎస్బీఐ ఐడియాలను ఆహ్వానిస్తోంది. ఇక ఇది టీం పార్టిసిపేషన్ హ్యాకథాన్ కాగా.. ఒక జట్టులో నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది సభ్యులు ఉండాలి. ఈ హ్యాకథాన్ ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ ద్వారానే సాగుతోంది. ముఖ్యమైన విషయమేంటంటే..  ఈ హ్యాకథాన్‌లో పాల్గొనే అభ్యర్థులు కచ్చితంగా ఇండియాలో నివస్తిస్తున్న వారు అయ్యి ఉండాలనే నిబంధనను ఉంది. ఇక ఈ హ్యాకథాన్‌లో పాల్గొనే వారు వినూత్న క్రియేటివ్ ఐడియాలు సమర్పించాలి..

వేరే వ్యక్తుల ఐడియాలను కాపీ కొడితే డిస్ క్వాలిఫై అవుతారని అధికారులు పేర్కొన్నారు..ఈ హ్యాకథాన్‌లో ఎస్‌బీఐ ఉద్యోగులు కూడా పార్టిసిపేట్ చేయవచ్చని తెలిపింది. ఇక ఇందులో మొత్తం 3 ఫ్రైజ్‌లు ఉన్నాయి. ఎస్‌బీఐ ఫస్ట్ ప్రైజ్‌కు రూ.5,00,000, సెకండ్ ప్రైజ్‌కు రూ.3,00,000, థర్డ్ ప్రైజ్‌కు ప్రైజ్ రూ.1,00,000 ఇస్తుంది. ఇందులో ఐడియా దశకు ఎంపికైన వారు మాత్రమే.. ఈ హ్యాకథాన్‌లో కొనసాగుతారు.

ఇకపోతే..

ఈ హ్యాకథాన్‌ కు సంభందించిన మరిన్ని వివరాలను వెబ్‌సైట్

https://www.techgig.com/digital/sbi-microsoft లింక్‌లో తెలుసుకోవచ్చు.

ఇందుకు అప్లై చేసేవాల్లు ఈ వెబ్‌సైట్ ను క్షుణ్ణంగా పరిశీలించి ఒకసారి బాగా చదివిన తర్వాత అప్లై చేసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news