బతుకమ్మ ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు శుభాకాంక్షలు చెప్పారు.
తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతూ, పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని సీఎం వ్యాఖ్యానించారు. 9 రోజులపాటు సాగే ఉత్సవాలలో తెలంగాణ సాంస్కృతిక సంబరం గొప్పగా వెల్లివిరుస్తుందన్నారు.
అంతేకాదు… తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.. బతుకమ్మ పండగను రాష్ట్ర పండగగా గుర్తించాం.. రూ.350 కోట్లతో బతుకమ్మ చీరలను మహిళలకు అందిస్తున్నాం.. తెలంగాణ సంస్కృతిని బతుకమ్మ విశ్వవ్యాప్తం చేసిందని వెల్లడించారు.