ఇండియన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న బెంగళూరు , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న తొలి మ్యాచుతో సమరానికి తెర లేవనుంది. 23న పంజాబ్-ఢిల్లీ, కోల్కతా-హైదరాబాద్ తలపడతాయి.దీంతో ఎప్పుడెప్పుడు సీజన్ ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ మరో గుడ్ న్యూస్ చెప్పింది.ఉప్పల్ మైదానంతో పాటు ఈ సారి వైజాగ్ లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని తెలిపారు .వైజాగ్ లో రెండు మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ ఖరారు చేసారు.
పార్లమెంట్ ఎన్నికలు ఉండటం వలన కేవలం 21 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది. 23న కోల్‌కతా తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఏప్రిల్ 7న గుజరాత్ టైటాన్స్, లక్నో జట్ల మధ్య చివరి మ్యాచ్ జరుగనుంది. అయితే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, పోలీసులు అంతా ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. ఐపీఎల్ మ్యాచ్ జరిగే మైదానాల్లో భద్రతా కోసం పోలీసుల అవసరం ఉన్నందున ,మిగిలిన మ్యాచ్‌లు ఎన్నికల తర్వాత నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.