బెల్లీ ఫ్యాట్ ని ఇలా సులభంగా తగ్గించేయచ్చు..!

-

ఈరోజుల్లో చాలామంది అధిక బరువు కొవ్వు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. బెల్లీ ఫ్యాట్ తో బాధపడే వాళ్ళు ఇలా ట్రై చేస్తే బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుంది. బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవడానికి ప్రతి రోజూ వ్యాయామం చేయడం సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గించడానికి ఈ పానీయాలు కూడా మీకు సహాయపడతాయి. మరి ఇక వీటికోసం చూసేద్దాం.
గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో నిమ్మరసం కలిపి తీసుకుంటే జీవక్రియ పెంచవచ్చు నిమ్మకాయలోని ఫైబర్ ఆకలి కోరికలతో పోరాడుతుంది. పొట్టని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది ఇలా మీరు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని తగ్గించుకోవచ్చు. గ్రీన్ టీ కూడా ఇందుకు సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. గ్రీన్ టీ ని తీసుకుంటే కూడా పొట్టు చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది.
అల్లం టీ కూడా ఇందుకు చక్కగా పనిచేస్తుంది. కొవ్వుని కరిగించడానికి అల్లం టీ బాగా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క టీ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగిస్తాయి. సోంపులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఆకలిని సోంపు తగ్గిస్తుంది. సోంపును తీసుకుంటే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు ఈజీగా తొలగిపోతుంది. సోంపు ని నీళ్ళని వేసుకుని తీసుకోవచ్చు. సోంపుతో చక్కగా టీ చేసుకుని తీసుకోవచ్చు. ఇలా ఈ పానీయాల ద్వారా ఈజీగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని తగ్గించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version