ఈ స్కీమ్‌తో రూ.10 లక్షల నుంచి రూ.65 లక్షలు వరకు పొందొచ్చు..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. అందులో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఆడ పిల్లలకు ఆర్థిక భద్రత ఇస్తుంది ఈ స్కీమ్. ఉన్నత చదువుల కోసం కానీ పెళ్లి కోసం కానీ ఇబ్బంది ఉండదు. కేంద్రం సుకన్య సమృద్ధి యోజన పేరుతో ఒక సేవింగ్ స్కీమ్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఆడ పిల్లలకు మాత్రమే ఈ స్కీమ్.

money
money

ఒక ఇంట్లో ఇద్దరు ఆడ పిల్లలు ఈ పథకంలో చేరొచ్చు. కవలలు అయితే ముగ్గురి వరకు చేరే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.  అంటే నెలకు రూ.12,500 వరకు డబ్బులు పెట్టొచ్చు. రూ.500 ఇన్వెస్ట్ చేసిన అకౌంట్ కొనసాగుతుంది.

అయితే ఇన్వెస్ట్ చేసిన దాని బట్టి రాబడి అనేది ఉంటుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అయితే అకౌంట్ ప్రారంభించిన దగ్గరి నుంచి 15 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యాలి.
అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ అకౌంట్లో నుంచి కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదంటే ఒకేసారి మెచ్యూరిటీ తర్వాత పూర్తి డబ్బులు పొందొచ్చు.

ఈ స్కీమ్ లో చేరాలంటే పోస్టాఫీస్ లేదా దగ్గరిలోని బ్యాంక్‌కు వెళ్లి చేరచ్చు. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన పథకంపై 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. ఇతర స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌తో పోలిస్తే ఈ స్కీమ్ నుండి బాగానే వస్తోంది.

కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుస్తుంది. నెలకు రూ.3 వేలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయలో రూ.105 లక్షలు పొందొచ్చు. రోజుకు రూ.410 పొదుపు చేసారంటే మెచ్యూరిటీలో రూ.65 లక్షలు చేతికి వస్తాయి. అదే నెలకు రూ.5 వేలు పెడితే మెచ్యూరిటీ సమయంలో రూ.25 లక్షలు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version