కరోనా వ్యాక్సినేషన్ బూస్టర్ డోస్… కీలక విషయం వెల్లడించిన భారత్ బయోటెక్…

-

కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతుండటంతో మరోసారి వ్యాక్సినేషన్ ప్రాముఖ్యత పెరుగుతోంది. దేశంలో ఇప్పటికే 150 కోట్ల డోసులను ప్రజలకు ఇచ్చారు. ప్రస్తుతం 15-18 ఏళ్ల వయసున్న టీనేజర్లకు వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా తీవ్రత పెరుగుతున్న క్రమంలో బూస్టర్ డోస్ ప్రాధాన్యత పెరుగుతోంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి బూస్టర్ డోస్ ఇవ్వాలనే ప్రతిపాదనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో బూస్టర్ డోసులను ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే బూస్టర్ డోసుల విషయంలో కీలక విషయం వెల్లడించింది దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్. రెండు డోసులు తీసుకున్నవారు 6 నెలల తర్వాత కోవాగ్జిన్ బూస్టర్ డోసు తీసుకుంటే.. కోవిడ్ నుంచి మెరుగైన రక్షణ పొందవచ్చని భారత్ బయోటెక్ వెల్లడించింది. క్లినికల్ ట్రయల్స్ లో ఈ ఫలితాలు వెల్లడయ్యాయని సంస్థ తెలిపింది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా కనిపించలేదుని తెలిపింది. బూస్టర్ డోస్ తీసుకున్న 90 శాతం మందిలో కరోనా వైరస్ ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ల నుంచి రక్షించే యాంటీ బాడీలు పెరుగుతున్నట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version