అంబేద్కర్ కు నివాళి అర్పించారా : భట్టి

-

సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, దళితుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏ రోజు అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్కు నివాళులు అర్పించారా అని అడిగారు ఆయన. ప్రతి సారి కెసిఆర్ అంబేద్కర్ను అవమానించారని ఆగ్రహం వ్యక్తపరిచారు. దళిత గిరిజనులను మోసం చేసే ప్రక్రియ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు. 2014 సంవత్సరం లో విగ్రహం పెడతా అని చెప్పిన కేసీఆర్..ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనే భయంతోనే విగ్రహం ఏర్పాటు చేశారని మండిపడ్డారు భట్టి.

Mallu Bhatti Vikramarka: మోడీ జీ.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పి.. తెలంగాణలో  అడుగుపెట్టండి - NTV Telugu

ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్కు దళితులు గుర్తుకు వస్తారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. గొర్రెల స్కీం, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపధ్యం లో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం పాదయాత్ర శిబిరం నుంచి సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ పంపారు. వెట్టి చాకిరి కింద గ్రామాల్లో ఇచ్చిన భూములని కేసీఆర్ ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. ఫార్మాసిటీ పేరుతో 7 వేల ఎకరాలు దళిత గిరిజనుల వద్ద నుంచి గుంజుకున్నారని మండిపడ్డారు. దళితులకు, గిరిజనులకు క్యాబినెట్లో సముచిత స్థానం కల్పించకుండా అవమానపరిచింది నిజం కాదా అని అడిగారు భట్టి విక్రమార్క.

 

 

Read more RELATED
Recommended to you

Latest news