కొనుగోలు చేయడం బీజేపీ.. టీఆర్‌ఎస్‌కి కొత్త ఏం కాదు : భట్టి

-

తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిన్న రాత్రి మొయినాబాద్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై కాంగ్రెస్‌ నేతలు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై తాజా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందిస్తూ.. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడం కొత్త కాదన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొన్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ కూడా అంతే.. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటోంది అంటూ ఆయన విమర్శించారు. కొత్తగా రెండు పార్టీలు డ్రామా లు అడుతున్నాయని, కొనుగోలు చేయడం బీజేపీ.. టీఆర్‌ఎస్‌కి కొత్త ఏం కాదని ఆయన అన్నారు. సర్పంచులు నుండి మొదలుకుని కొనుగోలు చేసింది టీఆర్‌ఎస్‌ అని ఆయన వ్యాఖ్యానించారు.

అధికారంలోకి వస్తే లక్ష్యాలు నెరవేరుస్తాం.. టీఆర్ఎస్‌పై భట్టి విక్రమార్క  విసుర్లు | fullfill all Guarantees:bhatti vikramarka - Telugu Oneindia

నిన్నటి నుంచి డ్రామా రక్తి కట్టించే పనిలో పడ్డారని, కానీ ప్రజలు నమ్మడం లేదని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను లాక్కుంటాం అని బీజేపీ మొదటి నుండి చెప్తుందని, మీ దగ్గరికి వచ్చే సరికే ఏదో జరిగి పోతుంది అని టీఆర్‌ఎస్‌ గగ్గోలు పెడుతుందన్నారు. బీజేపీ..టీఆర్‌ఎస్‌ వ్యవహారం నీచంగా ఉందని, పార్టీ ఫిరాయింపుల చట్టం లొసుగులను బీజేపీ.. టీఆర్‌ఎస్‌ వాడుకుంటుందని, కాగ్రెస్ అధికారంలోకి వస్తే 10 షెడ్యూల్ మార్చుతామన్నారు భట్టి.

Read more RELATED
Recommended to you

Latest news