మోస్ట్ అవైటింగ్ “భోళాశంకర్” టీజర్ అవుట్…

-

మెగాస్టార్ చిరంజీవి వయసు మీద పడుతున్న యువ హీరోలకు ధీటుగా నటిస్తూ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ మధ్యనే చిరంజీవి నుండి వచ్చిన వాల్తేరు వీరయ్య సక్సెస్ తో మరో సినిమాతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన భోళాశంకర్ మూవీ నుండి ఒక అద్భుతమైన అప్డేట్ కాసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది, ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తుండగా … చిరుకు చెల్లెలుగా మహానటి కీర్తి సురేష్ నటించింది. టీడీర్ మొత్తం చిరంజీవి ఫుల్ జోష్ తో నటించి మరో హిట్ ను కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాలి.

ఇక ఈ సినిమా ఆగష్టు 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరి చిరు వరుసగా మరో హిట్ ను అందుకుంటాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version