‘బిగ్ బాస్’ ఓటీటీ షోలో ఏడో వారంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాబా మాస్టర్ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంటిలోకి పంపారు ‘బిగ్ బాస్’. మహేశ్ విట్టాను ఎలిమినేట్ చేశారు. ఇక ఎనిమిదో వారంలో గేమ్ ఇంకా రసవత్తరంగా అవకాశాలు అయితే ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజీ, కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ ఆధారంగా వారిరువురు మధ్యనే గట్టి పోటీ ఉందని వార్తలొస్తున్నాయి.
గతంలో ఓటింగ్ పర్సంటేజీలో దూసుకుపోయిన బిందు మాధవి ఈ సారి కాస్త వెనకబడిందట. అయితే, బిందు మాధవి సపోర్టర్స్ మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇక ఇప్పటి వరకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజీ ఆధారంగా టాప్ ప్లేస్ లో అనిల్ రాథోడ్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఆయన తర్వాత సెకండ్ ప్లేస్ లో అఖిల్ సార్థక్ ఉన్నారు. అలా వీరిరువురి మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ ఉంది.మూడో స్థానంలో బిందు మాధవి ఉండగా, ఆమె తన ఆటలో కన్సిస్టెన్సీ అయితే మెయింటేన్ చేస్తోందని సోషల్ మీడియాలో ఆమె గురించి బీబీ లవర్స్ పేర్కొంటున్నారు.
‘బిగ్ బాస్’ లో చివరి వరకు కొనసాగి టైటిల్ విన్ చేసుకునే సత్తా బిందు మాధవికే ఉందంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే, ఓటింగ్ ను ప్రభావితం చేసే అంశాలు ‘బిగ్ బాస్’ ఇచ్చే టాస్కుల ఆధారంగా మారే అవకాశాలూ ఉన్నాయి. చూడాలి మరి ..ఏం జరుగుతుందో..