ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ కి ముందు మోడీ సర్కార్ కీలక ప్రకటన చేసింది మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఉపయోగించే భాగాలైన దిగుమతి సుంకాన్ని తగ్గించింది సెల్ఫోన్స్ విడి భాగాలపై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు 15% నుండి అది పది శాతానికి తగ్గినట్లు తెలుస్తోంది.
సిమ్ సాకెట్లు మెటల్ భాగాలు సెల్యులర్ మాడ్యూల్స్ అలానే ఇతర మెకానిక్ లో వస్తువులపై దిగుమతి సుంకాన్ని కేంద్రం ఐదు శాతం తగ్గించింది మిడిల్ కవర్ మెయిన్ లైన్స్ బ్యాక్ కవర్ వంటి మెటీరియల్ పై కూడా దిగుమతి సుంకాన్ని కేంద్రం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ డెసిషన్ పై కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విన్ వైష్ణవ హర్షం వ్యక్తం చేశారు.