సామాన్యులకు బిగ్‌షాక్.. త్వరలో పెరగనున్న ప్రైవేట్ హాస్పిటల్స్ బెడ్ చార్జెస్!

-

రాష్ట్రంలో ఇప్పటికే అడ్డగోలుగా ఫీజులు చార్జెస్ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వాహకులు త్వరలోనే సామాన్యులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. చిన్న పాటి జ్వరానికే నానా హడావుడి చేసి వేలల్లో డబ్బులు లాగే ప్రైవేట్ ఆస్పత్రులు బెడ్ చార్జిలను పెంచాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ప్రయివేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలని ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. దీనిపై వైద్యశాఖ సైతం ఆలోచన చేస్తున్నది.

కొత్తగా ఏర్పాటయ్యే హాస్పిటళ్లకు ఈ టారీఫ్‌లు వర్తింపజేయాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీలు తక్కువగా ఉన్నాయని భావించిన వైద్యశాఖ, బెడ్స్ వారీగా ఫీజులు నిర్ణయించాలని ఆలోచిస్తున్నది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 200 పడకలు, ఆ పైన ఉన్న పెద్ద ఆస్పత్రులకు రూ.16 వేలు మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జీలు ఉన్నాయి. దీనిని పెంచాలని ఉన్నతాధికారులు సైతం కసరత్తులు చేస్తున్నారు.దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే చాన్స్ ఉన్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version