అమరావతి : జగన్ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. దుర్గగుడి టెండర్ల విషయం లో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. శానిటేషన్, హౌస్ కీపింగ్ కోసం టెండర్లు పిలిచిన దుర్గ గుడి అధికారులు.. టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించలేదని లా మెక్లయిన్ ఇండియా సంస్థను పాల్గొనకుండా చేశారు. అయితే ఈ విషయం పై హైకోర్టు ను ఆశ్రయించింది లా మెక్లయిన్ ఇండియా సంస్థ.
అయితే ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించిందని తెలిసిన వెంటనే టెండర్లను రద్దు చేశారు అధికారులు. పాత కాంట్రాక్టర్ ను కొనసాగించేందుకు రెండేళ్ల నుంచి టెండర్లు పిలవకుండా జాప్యం చేస్తున్నారని హై కోర్టు లో వాదించారు న్యాయవాది ముప్పుటూరి వేణుగోపాలరావు. ఎప్పటికప్పుడు టెండర్లను పిలవకుండా జాప్యం చేస్తున్నారని ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే రద్దు చేసిన టెండర్లను రీ ఓపెన్ చేయాలని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లా మెక్లయిన్ ఇండియా సంస్థను టెండర్లలో పాల్లొనే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వెంటనే టెండర్లను తెరవాలని ఆదేశించింది హై కోర్టు.