BREAKING : హిజాబ్ అంశంపై బిగ్‌ ట్విస్ట్‌..సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు

-

BREAKING : హిజాబ్ అంశం ప్రస్తుతం దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని బీజేపీ, విపక్షాలు రాజకీయంగా వాడుకుంటున్నాయి. అయితే.. ఇవాళహిజాబ్ అంశంపై ఇవాళ విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ట్విస్ట్‌ చోటు చేసుకుంది. హిజాబ్ అంశంపై పరస్పర భిన్న తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు ధర్మాసనం.

ధర్మాసనంలోని ఇద్దరు జడ్జిలు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధూలియా వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. కర్నాటక హైకోర్టు తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా..సమర్థించగా, హైకోర్టు తీర్పును తోసిపుచ్చారు జస్టిస్ సుధాన్షు ధులియా. హిజాబ్‌ను సమర్థిస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ హేమంత్ గుప్తా.. తోసిపుచ్చారు. ఇక భిన్న అభిప్రాయాలతో కూడిన తీర్పు నేపథ్యంలో విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version