బిగ్ బాస్ లో నిజంగా ఆ సీన్లు ఉన్నాయా?

-

తెలుగులో టాప్ రియాలిటీ షో లలో ఒకటి బిగ్ బాస్..ఇప్పుడు సీజన్ 6 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.. మరి కొద్ది రోజుల్లో సీజన్ కు ముగింపు పలుకుతుంది అనుకొనేలోపే ఇప్పుడు మరో షాక్ తగిలింది.ఏపీ హైకోర్టు తాజాగా ఈ షోకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చింది. ఈ షో మేకర్స్ తో పాటుకింగ్ నాగార్జునకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా నోటీసులిచ్చింది. ఇదే న్యూస్ తో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ షో అశ్లీలతకు.. కేరాఫ్‌గా ఉందని.. వ్యభిచార కొంపలా ఉందని, యూత్‌ను పెడదోవ పట్టిస్తోందని ఎప్పటి నుంచో బడా నేతలు కొంత మంది ఆరోపిస్తున్నారు. అంతేకాదు షో బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. కోర్టులో పిటిషన్లు కూడా ఇచ్చారు. కానీ తాజాగా తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ దిశగా కాస్త సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది.

ఇటీవల ఈయన ఈ షోపై ఏపీ హైకోర్టులో ప్రజ ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. అయితే దీన్ని విచారించిన కోర్టు.. రెండు మూడు రోజుల కిందట అందరూ షాకయ్యేలా మాట్లాడింది. బిగ్‌ బాస్‌ పై తీవ్ర అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయో తెలుసుకునేందుకు రెండు మూడు ఎపిసోడ్స్‌ చూస్తామని చెప్పింది. ఎలాంటి సెన్సార్‌ షిప్ లేకుండా … షో టెలీకాస్ట్ చేస్తున్నారన్న పిటిషన్ దారుని ఆరోపణతో.. ఈ షో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలను కూడా అప్పుడే ఆదేశించింది. వీటన్నింటినీ పరిశీలించాకే తీర్పు ఇస్తామంటూ స్పష్టం చేశారు.

తాజాగా బిగ్ బాస్ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయాన్ని వచ్చింది ఏపీ కోర్టు. పిటిషన్ దారుని వాదనతో పూర్తిగా ఏకీభవించింది. ఈ క్రమంలోనే ఈ షో నిర్వాహకులకు నోటీసులిచ్చింది. దాంతో పాటే ఈ షో హాస్ట్ కింగ్ నాగార్డునకు… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీసులు పంపింది. ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్ పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది..ఇది ఇలా వుండగా.. షో ను ఆపేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి… మరి ఈ వార్త పై స్టార్ మా యాజమాన్యం క్లారిటీ ఇవ్వాల్సి వుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version