తెలంగాణ ప్రజలు షాక్… ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…!

-

కరోనా విజృంభణ తరువాత తెలంగాణలో ఇప్పటికే ఒకసారి ఆర్టీసీ చార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణలో మరో సారి ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. వేలకోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయి ఉన్న ఆర్ టి సి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ నిర్ణయానికి ప్రభుత్వం కూడా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ముందు నుండే ఆర్టీసీ నష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కాలంలో ఆర్టీసీ పై మరింత ప్రభావం పడింది. అంతే కాకుండా బ్యాంకుల నుంచి ఆర్టీసీ తీసుకున్న అప్పుల భారం మోయలేక పోతోంది.

ఈ నేపథ్యంలో మరోసారి చార్జీలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా ఆర్టీసీ ఛార్జీలతో పాటు తెలంగాణ లో విద్యుత్ ఛార్జీలను పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యుత్ చార్జీల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే పెరిగిన చార్జీలను అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు ఆందోళన చెందుతుంటే ఇప్పుడు చార్జీలు పెంచి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version