మూడు నెలల్లో మూడు రాజధానుల బిల్లు – గుడివాడ అమర్నాథ్

-

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లు కొద్దిరోజులుగా అందరినీ వెంటాడుతున్న ప్రశ్న. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు తీసుకొస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా మూడు రాజధానులపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మరో మూడు నెలల్లో మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెడతామని ఆయన స్పష్టం చేశారు.

 

రాష్ట్ర విభజన తర్వాత అమరావతి ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అప్పటి టిడిపి ప్రభుత్వం నిర్ణయించింది. తాత్కాలికంగా అసెంబ్లీతో పాటు సెక్రటేరియట్ కూడా నిర్మించారు. హైకోర్టును కూడా ఏర్పాటు చేశారు.ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్టుండి పాలనా వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే తాజాగా విశాఖ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శనివారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూడునెలల్లో రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెడతామని స్పష్టం చేశారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి తీరుతామని అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version