బీజేపీలో చేరిన దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు…

-

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అన్ని పార్టీలు పొత్తులు, నాయకులను చేర్చుకునే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వివిధ పార్టీల మధ్య నేతలు జంపింగ్ లు చేస్తున్నారు. యూపీలో బీజేపీ నుంచి ఎస్పీలోకి, ఎస్పీ నుంచి బీజేపీలోకి నేతల వలసలు కొనసాగుతున్నాయి. గత వారం బీజేపీ నుంచి పలువురు మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరగా… తాజాగా బీజేపీ ఎస్పీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ కుటుంబాన్నే టార్గెట్ చేసింది. ఏకంగా ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడుకు భార్య అపర్ణయాదవ్ బీజేపీలో చేరింది. 

తాజాగా దేశ తొలి సీడీఎస్, దివంగత బిపిన్ రావత్ సోదరుడు కల్నల్ విజయ్ రావత్ (రిటైర్డ్) ఢిల్లీలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మా నాన్న పదవీ విరమణ తర్వాత బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చిందని..ప్రధానమంత్రి మోదీ విజన్ నచ్చే బీజేపీలో చేరానని విజయ్ రావత్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version