బలం పెంచుకుంటున్న కమలం..ఇది సరిపోదు!

-

తెలంగాణలో బీజేపీ దూకుడు కొనసాగుతుంది…అధికార టీఆర్ఎస్‌కు చెక్ పెట్టే దిశగా కమలం పార్టీ ముందుకెళుతుంది…కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసిన…వాటికి ధీటుగా కమలం కూడా రాజకీయం చేస్తుంది. కమలంతో డేంజర్ అని భావించి కేసీఆర్ అనూహ్యంగా వ్యూహం మార్చేసి ముందుకెళుతున్న విషయం తెలిసిందే…తెలంగాణకు మోదీని విలన్ గా చేసి చూపించే ప్రయత్నం చూస్తున్నారు..అలాగే తెలంగాణ సెంటిమెంట్‌ని మళ్ళీ రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారు.

అయితే కేసీఆర్ చేసే రాజకీయానికి కమలం కూడా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. టీఆర్ఎస్‌ని ఎక్కడకక్కడ నిలువరించే ప్రయత్నాలు చేస్తుంది. ఇలా రాజకీయంగా ముందుకెళుతూనే…మరో వైపు సంస్థాగతంగా బలపడేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి నేతృత్వంలోని యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేసుకున్నారు. బండి సంజయ్‌ సమక్షంలో బాలకృష్ణా రెడ్డితో పాటు.. యువ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్ రాణి రుద్రమారెడ్డి బీజేపీలో చేరారు.

ఇలా తెలంగాణ ఉద్యమంలో పోరాడిన నేతలు బీజేపీలోకి రావడం అనేది ప్లస్ అవుతుందనే చెప్పాలి…తెలంగాణలో బాలకృష్ణారెడ్డికి, రాణిరుద్రమకు మంచి ఫాలోయింగ్ ఉంది…ఇలాంటి నేతలు బీజేపీలో చేరడంతో, ఆ పార్టీకి అదనపు బలం చేకూరుతుంది. బీజేపీలో చేరిన వీరికి సీట్లు కూడా దాదాపు ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బాలకృష్ణారెడ్డికి భువనగిరి ఎంపీ సీటు, రాణిరుద్రమకు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతుంది.

టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలని చూస్తున్న బీజేపీకి..ఈ చేరికలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్పొచ్చు. ఇదే క్రమంలో టీఆర్ఎస్‌లో నాయకులని సైతం బీజేపీలోకి లాగితే పార్టీకి ఇంకా బెనిఫిట్ అవుతుంది. అప్పుడే టీఆర్ఎస్‌ని నిలువరించినట్లు అవుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్‌లో పలువురు అసంతృప్తి నేతలు ఉన్నారు…వారిని బీజేపీలోకి లాగితే ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఆ దిశగా బండి సంజయ్ పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే రాజకీయంగా ఎదుర్కోవడంతో పాటు సంస్థాగతంగా టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ ఎదుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version