మహిళను చంపదెబ్బ కొట్టిన బిజెపి మంత్రి.. వీడియో వైరల్

-

కర్ణాటకలో ఒక బహిరంగ కార్యక్రమంలో ఓ మహిళను బిజెపి పార్టీకి చెందిన ఓ మంత్రి చెంప దెబ్బ కొట్టిన షాకింగ్ సంఘటన సంచలనం సృష్టిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన శనివారం కర్ణాటకలోని గుండ్లుపేట నియోజకవర్గం హంగాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి సోమన్న శనివారం హంగాలా గ్రామంలో మహిళల అభివృద్ధి దారులకు భూమి హక్కు పత్రాలను పంపిణీ చేశారు.

అయితే స్థానిక కాంగ్రెస్ నాయకుడు నంజప్ప సూచించిన మేరకే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగిందని మెంపమ్మ అనే మహిళ వేదిక వద్దకు వచ్చి ఆరోపించింది. తనకు ప్రభుత్వ లబ్ధి చేకూరలేదని మంత్రితో తన గోడును వెల్లబోసుకునేందుకు అక్కడికి రావడంతో ఆ మంత్రి మహిళను చెంప దెబ్బ కొట్టారు. అయినప్పటికీ ఆ మహిళ మంత్రి పాదాలకు నమస్కరించడం ఈ వీడియోలో చూడొచ్చు. మహిళ పట్ల మంత్రి ప్రవర్తించిన తీరుపై నేటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version