బీజేపీ నయా స్కెచ్.. ఆ ఓట్లే టార్గెట్!

-

తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే దిశగా పనిచేస్తున్న బీజేపీ ఎప్పటికప్పుడు కొత్త స్కెచ్ లతో ముందుకొస్తుంది. ఎలాగైనా అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టి..తెలంగాణ గడ్డపై తొలిసారి కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తుంది. ఆ దిశగానే బి‌జే‌పి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో బి‌జే‌పి ముందుకెళుతుంది. ఇదే క్రమంలో తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ ఓటర్లని ఆకర్షించడమే లక్ష్యంగా బి‌జే‌పి పావులు కదుపుతుంది.

ఇప్పటికే ప్రజాగోసా-బీజేపీ భరోసా పేరిట ప్రజల్లోకి వెళ్ళిన బి‌జే‌పి..ఇప్పుడు ‘పల్లె పల్లెకూ ఓబీసీ..ఇంటింటికీ బీజేపీ’ పేరిట కార్యక్రమం చేసేందుకు బి‌జే‌పి సిద్ధమైంది. వచ్చే నెల మొదటివారంలో బి‌జే‌పి ఈ కార్యక్రమం మొదలపెట్టనుంది. మొదట పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయనుంది. అయితే బీసీ ఓట్లని ఆకర్షించడమే లక్ష్యంగా బి‌జే‌పి ఈ కార్యక్రమం చేస్తుంది. ఇప్పటికే హిందూ ఓట్లరని లక్ష్యంగా చేసుకుని బి‌జే‌పి రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. బి‌ఆర్‌ఎస్-ఎం‌ఐ‌ఎం కలిసే పనిచేస్తాయని చెప్పి హిందూ ఓట్లని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పుడు తెలంగాణలో అత్యధికంగా బీసీ ఓటర్లని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఇతర పార్టీల్లో ఉన్న కీలకమైన నాయకులని బి‌జే‌పిలోకి లాగాలని చూస్తున్నారు. వాస్తవానికి మునుగోడు ఉపఎన్నిక దగ్గర నుంచి బి‌జే‌పిలో చేరికలు లేవు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి బడా నేత తర్వాత..బి‌జే‌పిలో ఆ స్థాయిలో చేరికలు లేవు.

మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెరపైకి రావడంతో అప్పటినుంచి బి‌జే‌పిలో చేరికలు ఆగాయి. అంటే బి‌జే‌పి వ్యూహాత్మకంగా చేరికలకు బ్రేకులు వేసిందా? లేదంటే బి‌జే‌పిలో చేరడానికి నేతలు ఆసక్తి చూపడం లేదా? అనేది అర్ధం కాకుండా ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇకపై చేరికలు ఉంటాయేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news