కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ కావడంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. కేవలం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన మెచ్చి…ఆయన్ని అభినందించడానికే..షా భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఈ భేటీ వెనుక రాజకీయ కోణం కూడా ఉందని విశ్లేషణలు వస్తున్నాయి.
ఇప్పటికే తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ తెగ కష్టపడుతుంది..ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న వారిని దగ్గర చేసుకుంటే బెనిఫిట్ అవుతుందనే కోణంలో బీజేపీ రాజకీయం చేస్తుందని కథనాలు వస్తున్నాయి. ఎలాగో పవన్‌తో పొత్తులో ఉన్నారు. దీని వల్ల తెలంగాణలో సెటిల్ అయిన ఏపీ ఓటర్ల మద్ధతు పెరుగుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ మద్ధతు కూడా దక్కితే…ఇంకా ఎక్కువ స్థాయిలో సెటిలర్ల మద్ధతు బీజేపీకి వస్తుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏపీ ఓటర్ల ప్రభావం ఎక్కువ..aలాగే ఏపీకి పక్కనే ఉన్న ఖమ్మం జిల్లాలో కూడా ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ లాంటి వారిని దగ్గర చేసుకుంటే సెటిలర్లు దగ్గరవుతారని బీజేపీ భావిస్తుంది. అయితే సెటిలర్లు 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు తెలపగా, అప్పుడు పొత్తులో ఉన్న బీజేపీకి కూడా బెనిఫిట్ జరిగింది.
ఇక 2018 ఎన్నికల్లో వారు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడానికి ప్రధాన కారణం కూడా వారే. సెటిలర్ల ఉన్న డివిజన్లలో టీఆర్ఎస్ గెలిచింది. అందుకే వారిని తమ వైపుకు తిప్పుకుంటే అధికారం దక్కుతుందని బీజేపీ అనుకుంటుంది..ఎలాగో పవన్ సపోర్ట్ ఉండటం కలిసొచ్చే అంశం…అదే క్రమంలో ఎన్టీఆర్ లాంటి వారిని దగ్గర చేసుకుంటే ఇంకా బెనిఫిట్ అవుతుందనేది అమిత్ షా ఆలోచన అని తెలుస్తోంది. ఏదేమైనా గాని ఎన్టీఆర్-షా భేటీపై పెద్ద చర్చే నడుస్తోంది.