రాజకీయాల్లో పార్టీలకు గేమ్ ఛేంజర్ల అవసరం చాలా ఉందని చెప్పొచ్చు.. సైలెంట్ గా బ్యాగ్రౌండ్ లో పనిచేస్తూ.. ఎప్పటికప్పుడు పార్టీని లైన్ లో పెట్టి, ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి కొందరు నేతలు అవసరం. ఓ రకంగా చెప్పాలంటే వ్యూహకర్తలు అని చెప్పొచ్చు. అయితే ఒకప్పుడు వ్యూహకర్తలు పార్టీల్లోనే ఉండేవారు.. కానీ ఇప్పుడు బయటనుంచి తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ పేరు ఎక్కువ వినిపిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటివరకు తానే పెద్ద పోలిటికల్ స్ట్రాటజిస్ట్.. గేమ్ ఛేంజర్ అని భావించే కేసీఆర్ సైతం.. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మీద ఆధారపడాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణలో మూడోసారి అధికారం దక్కడం కేసీఆర్ కు కష్టమైన పని.. అందుకే ఆయన కూడా ఈ సారి తన వ్యూహాలు నమ్ముకోకుండా.. పీకే టీంని నమ్ముకున్నారు. దీంతో టీఆర్ఎస్ కోసం పీకే టీం పనిచేయడం మొదలైపోయింది.
ఇక బలమైన కేసీఆర్.. తిరుగులేని వ్యూహకర్తగా ఉన్న పీకే లాంటిని ఎదురుకుని నిలబడాలంటే.. బీజేపీ చాలా కష్టపడాలి. ఇక వారికి లాగే గేమ్ ఛేంజర్లు కావాలి. అయితే తెలంగాణ బీజేపీలో అలాంటి గేమ్ ఛేంజర్లు పెద్దగా లేరు. కానీ ఎప్పుడైతే వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి లాంటి వారు బీజేపీలోకి వచ్చారో.. అప్పటినుంచి బీజేపీకి కూడా మంచి గేమ్ ఛేంజర్లు దొరికారని చెప్పొచ్చు.
అయితే వీరు పార్టీలో పైకి కనిపించరు.. బండి సంజయ్, కిషన్ రెడ్డి, కే. లక్ష్మణ్, అరవింద్ లాంటి వారు పైకి కనిపిస్తారు గాని.. వివేక్ సైలెంట్ గా బ్యాగ్రౌండ్ లో పనిచేస్తారు. ఓ రకంగా చెప్పాలంటే బీజేపీకి బ్యాక్ బోన్ గా ఉన్నారని చెప్పొచ్చు. పార్టీకి ఆర్ధికంగా అండగా నిలబడటంలో ముందున్నారు. ఈటల రాజేందర్ లాంటి వారిని పార్టీలోకి తీసుకొచ్చి.. హుజూరాబాద్ లో గెలవడానికి వివేక్ బ్యాగ్రౌండ్ వర్క్ కూడా ఒక కారణమే. ఆర్ధికంగా సపోర్ట్ ఇస్తున్నారు. అటు జితేందర్ రెడ్డి సైతం వివేక్ తో కలిసి పనిచేస్తున్నారు. వీరికి ఇప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలిశారు.. ఈ ముగ్గురు ఇప్పుడు బీజేపీలో గేమ్ ఛేంజర్లు అని చెప్పొచ్చు.. సైలెంట్ గా పనిచేసే నేతలు.