బాలీవుడ్ ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రసిద్ధ దర్శకుడు, దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత మనోజ్ కుమార్ (87) ఇవాళ మృతి చెందిన విషయం తెలిసిందే. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ముంబయి లోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త గురించి తెలుసుకున్న పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరుణంలో బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ మరణం పై ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన మరణం చాలా బాధాకరం అన్నారు. చిత్ర పరిశ్రమలో మనోజ్ కుమార్ ది ప్రత్యేక స్థానం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ తరుణంలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన అమూల్యమైన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందించింది.