ఒక సంస్థ నుంచే డీఎంకే పార్టీ కి ₹509 కోట్ల విలువైన బాండ్లు

-

కోర్టు ఆదేశాల మేరకు sbi ఇటీవల ఈసీకి ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను పీడీఎఫ్‌ రూపంలో అందించిన సంగతి తెలిసిందే.SBI బాండ్ల ఆల్ఫా న్యూమరిక్‌ నంబర్లను ఎన్నికల కమిషన్‌కు అందించకపోవడాన్ని ఇటీవల సుప్రీంకోర్టు మండిపడ్డ విషయం తెలిసిందే.దీంతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టింది.సుప్రీంకోర్టు సూచనతో బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో మరోసారి వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచినట్లు ఎక్స్‌లో ఈసీ పేర్కొంది.

ఎలక్ట్రోరల్ బాండ్ల విషయంలో ‘ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్’ పేరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సంస్థ అత్యధికంగా ₹1,368 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీ కొనుగోలు చేసిన బాండ్ల మొత్తంలో ₹509 కోట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ ఖాతాలోకి చేరడం విశేషం. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తాజాగా వెల్లడించింది. ఒక పార్టీకి ఇంతపెద్ద మొత్తంలో బాండ్లు ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version