ఏడు కోట్ల పెయింటింగ్ మీద బోర్ కొట్టి కళ్ళని గీసిన సెక్యూరిటీ గార్డు…!

-

బోర్ కొట్టిన సెక్యూరిటీ గార్డు మిలియన్ డాలర్ల పెయింటింగ్ ని పాడు చేసాడు. ఏం చేయాలో తోచక ఖాళీగా ఉంటూ ఒక పెన్ తీసుకుని ఆ పెయింటింగ్ పైన కళ్ళు గీసాడు. ట్రెటియాకోవ్ గ్యాలరీ కలెక్షన్ లో ఉండే త్రీ ఫిగర్స్ అనే పెయింటింగ్ ని ప్రదర్శన లో వేలాడదీశారు. ఈ పెయింటింగ్ ని పశ్చిమ-మధ్య రష్యాలోని స్వర్డ్‌లోవ్స్క్ ఓబ్లాస్ట్ ప్రాంతంలోని యెల్ట్సిన్ సెంటర్‌లో హ్యాంగ్ చేయడం జరిగింది.

అయితే బోర్ కొట్టిన సెక్యూరిటీ గార్డు పెయింటింగ్ లో ఉన్న ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు ముఖాలపై బాల్ పాయింట్ పెన్ తో కళ్ళని గీసాడు. అయితే ఈ సెక్యూరిటీ గార్డు వయసు 60 ఏళ్లు ఉంటాయి. ఇంత పని చేసినందుకు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ పెయింటింగ్ ని డిసెంబర్ 7 2021న ‘ది వరల్డ్ యాజ్ నాన్-ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఎ న్యూ ఆర్ట్’ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించబడింది.  అయితే పోలీసులు ఆరా తీశారు.

ఈ వ్యక్తికి రూ. 39,900 జరిమానాతో పాటుగా ఒక సంవత్సరం సవరణ కార్మిక శిక్ష వేశారు. పెయింటింగ్‌కు జరిగిన నష్టం రూ. 2,49,500గా అంచనా వేశారు. అయితే పెయింటింగ్ ధర మొత్తం ఎంత అన్నది స్పష్టత లేదు. ఏడు కోట్లు వుండచ్చని అంచనా.  మళ్ళీ పెయింటింగ్ రూపుని తీసుకు రావడానికి నిపుణులు కృషి చేస్తున్నారు. అయితే దీనిని గతంలో ఎలా ఉందొ అలా మార్చచ్చని ఎలాంటి సమస్య లేదు అని యెల్ట్సిన్ సెంటర్ ఇన్స్పెక్ట్ చేసి మాస్కో కి కూడా పంపింది.

Read more RELATED
Recommended to you

Latest news