బాలీవుడ్ వారికి బాయ్ కాట్ కు పరస్పర సంబందం ఉన్నట్లు గా కనపడుతోంది. వారు కావాలని కాంట్రవర్సీ చేయాలనీ చూస్తోరో లేదో కాని ప్రస్తుతం బాలీవుడ్లో ప్రతి సినిమా కు బాయ్ కాట్ సెగ తగులు తోంది. గతంలో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్ద విషయంలో పెద్ద రగడ జరిగి ఆ సినిమా పై బాయ్ కాట్ ఉద్యమం చేపట్టి దాన్ని ప్లాప్ అయ్యేలా చేశారు. ఇప్పుడు మరో సినిమా పై కూడా అదే స్థాయిలో ప్రచారం జరుగుతోంది.
తాజాగా బాయ్ కాట్ వివాదం మరో ఖాన్ అయిన షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘పఠాన్’ మూవీపై పడింది. ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసిన దగ్గరి నుంచే ఈ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ ప్రచారం జోరందుకుంది. హాట్ సాంగ్ లో షారుక్ మరియు దీపిక రొమాన్స్ వల్లే ఈ గోల మొదలైంది. మరీ ముఖ్యంగా పెళ్లైన యువతి మరీ ఇంతలా రెచ్చిపోయి టూ పీస్ బికినీలో అంగాంగ ప్రదర్శన చేయడంపై గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో మరీ ఇంత పచ్చిగా ఎవరూ నటించలేదని ఒక స్టార్ హీరోయిన్ అయి వుండి పెళ్లైనా కూడా ఇలా రెచ్చిపోవడం ఏమీ బాగాలేదని దీపికపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీపికా పదుకొనె వస్త్రధారణ మరియు వాటి రంగు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని వివాదం చెలరేగడం తో అది వైరల్ గా మారింది. దీనితో అక్కడ నుంచి నార్త్ లో ఆడియెన్స్ ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చెయ్యాలని పిలుపునిచ్చారు. దీనితో ఇది ఈరోజుకి కూడా ట్రెండ్ అవుతూ పెరుగుతూ పోతుంది.