మొన్న యశ్… నేడు విజయ్‌ దేవరకొండ… బ్రహ్మాస్త్ర 2 ఛాన్స్ ఎవరికో!

-

బాలీవుడ్ లో రూపొందిన బ్రహ్మాస్త్ర సినిమా మొదటి భాగం బ్రహ్మాస్త్ర శివ పార్ట్ 1 హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో కూడా బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ అయింది. అయితే తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించకపోయినా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి వసూళ్లు కూడా రాబట్టింది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను మైమరిపించే విధంగా సాగింది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో విడుదలై మరోసారి ప్రేక్షకులను అందిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన రెండో భాగం మీద దృష్టి పెట్టారు మేకర్స్. ఈ రెండవ భాగం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. మొదటి భాగం శివలో రణబీర్ కపూర్ శివ అనే పాత్రలో కనిపిస్తాడు. అతని తండ్రిగా దేవ్ అనే వ్యక్తి కనిపిస్తాడు. మొదటి భాగంలో దేవ్ ఎవరు అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ దేవ్ పాత్రలో నటించవలసిందిగా హృతిక్ రోషన్, రణవీర్ సింగ్ అలాగే సౌత్ స్టార్ హీరో యష్ ను కూడా మేకర్స్ సంప్రదించారు.

అయితే వారెవరూ ఆ పాత్ర చేసేందుకు ఆసక్తి చూపించలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు లైగర్ హీరో విజయ్ దేవరకొండను ఆ పాత్రలో నటించమని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమాని లైగర్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. వీరిద్దరూ కలిసి లైగర్ సినిమా కోసం పనిచేయడంతో ఒకరి గురించి ఒకరికి బాగా పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండను ఈ దేవ్ పాత్రలో నటించమని కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే కథ విన్న తర్వాత విజయ్ దేవరకొండ ఆలోచించి చెప్తానని చెప్పారని ఒకవేళ విజయ్ దేవరకొండ ఓకే చెప్తే ఫ్యాన్స్‌కు పండగే అనిచెప్పవచ్చు. ఒకవేళ విజయ్ దేవరకొండ మాత్రం దేవ్ పాత్రలో గనుక నటిస్తే ఒక్కసారిగా సినిమా మీద మరింత హైప్ పెరగటం ఖాయంగా తెలుస్తోంది.

బాలీవుడ్ లైగర్‌తో ఎంట్రీ ఇద్దామనుకున్నా దేవరకొండకు… భారీగానే ఎదురుదెబ్బ తగిలింది. ఇక బ్రహ్మాస్త్రతోనైనా ఎంట్రీ ఇచ్చి… హిట్ కొడితే.. పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోతానడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version