BREAKING: ప్రభుత్వ ఉద్యోగులకు అడ్వాన్స్ సాలరీ…

-

రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగులు ఆ రాష్ట్ర ప్రభుత్వం మంచి వార్తను అందించింది. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రమూ చేయని విధంగా సరికొత్తగా ఒక విధానాన్ని ముందుకు తీసుకురావడానికి సంకల్పించింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం కోసం ఎంతో కష్టపడుతున్న ఉద్యోగులకు అడ్వాన్స్ గా సాలరీలను ఇవ్వడానికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీర్మానించారు. ఈ పద్దతిని ఈరోజు నుండే ఇక్కడ అమలులోకి తీసుకురానున్నారు. ఈ విధానం ప్రకారం రాజస్థాన్ ఉద్యోగులు జీతం తీసుకోవలసిన తేదీ కన్నా ముందే సాలరీలో సగం తీసుకునే సౌలభ్యం ఉంది. అయితే ఎంత పడితే అంత జీతాన్ని ముందుగా తీసుకోవడానికి వీలు లేకుండా.. రూ. 20 వేల వరకే అంటూ ఒక లిమిట్ ను ప్రభుత్వం పెట్టడం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం.

ఈ పద్దతిని అమలు చేయడానికి రాజస్థాన్ ఆర్ధిక శాఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version