బీఆర్ఎస్-వైసీపీ ఒక్కటే పాయింట్..బాబు పక్కా ప్లాన్..!

-

తెలంగాణ రాజకీయాల్లోకి మళ్ళీ చంద్రబాబు ఎంట్రీ ఇవ్వడంపై అక్కడ అధికార బీఆర్ఎస్‌ నుంచి విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో ఏపీలో అధికార పార్టీ వైసీపీ సైతం బాబుపై విమర్శలు చేస్తుంది. వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి బలం లేదు. కానీ తాజాగా ఖమ్మం సభ పెడితే భారీగా పార్టీ శ్రేణులు వచ్చాయి. సభా వేదికగా మళ్ళీ తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని బాబు పిలుపునిచ్చారు. పార్టీని వదిలి వెళ్ళిన నేతలు మళ్ళీ తిరిగి రావాలని కోరారు.

అయితే ఏ పార్టీపైన ఆయన విమర్శలు చేయలేదు. తెలంగాణలో కీలకంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఊసు తీయలేదు. కానీ బాబుపై అనూహ్యంగా బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బాబు పాలనలోనే తెలంగాణ దోపిడీకి గురైందని, ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా? అని మంత్రి హరీష్ రావు అన్నారు. అదే బాటలో కవిత, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్, గంగుల కమలాకర్..బాబు టార్గెట్ గా విమర్శలు చేశారు.

అటు ఏపీలోని అధికార వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా బాబు తెలంగాణ టూర్‌పై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వెళ్లి అక్కడి ప్రజలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని, అక్కడ కాంగ్రెస్‌లో బాబు స్లీపర్ సెల్స్ ఉన్నాయని రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఆరోపణలు చేశారు.

అయితే బీఆర్ఎస్-వైసీపీలు మాత్రమే బాబుపై విమర్శలు చేశారు. కాంగ్రెస్-బీజేపీ స్పందించలేదు. కాకపోతే బీఆర్ఎస్-వైసీపీ ఒక్కటే పాయింట్ చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీకి బలం ఉందని చూపించి..ఇక్కడ బీజేపీకి దగ్గరయ్యి..పొత్తు పెట్టుకుని, ఏపీలో కూడా లబ్ది పొందాలని బాబు ప్లాన్ చేశారని అంటున్నారు. అసలు బీజేపీ ఏమో బాబుని దగ్గరకు రానివ్వడం లేదు. కానీ బీఆర్ఎస్-వైసీపీ మాత్రం బీజేపీ కోసమే బాబు తిప్పలు అంటున్నాయి. మరి తెలంగాణలో ఏ మాత్రం బలం లేని బాబు వస్తే..బీఆర్ఎస్ ఎందుకు అంత తీవ్రంగా స్పందించిందో అర్ధం కాకుండా ఉంది. మొత్తానికి ఎవరి రాజకీయం వారు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version