బీఆర్ఎస్ చచ్చిన పాము లాంటిదని, కొన ఊపిరితో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘మీరు ఆ పామును అసెంబ్లీ ఎన్నికల్లో నడుము, తోక మీద కొట్టారు. ఈసారి పడగ మీద కొడితే శాశ్వతంగా ఆ కాలనాగు పీడ విరగడవుతుంది’ అని అన్నారు.
ధర్మపురి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కొప్పుల ఈశ్వర్నే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.పాలకుర్తి లిఫ్ట్, రామగుండంలో 800 యూనిట్ల పవర్ జనరేషన్, నేతకాని కార్మికులకు కార్పోరేషన్, మంచిర్యాలలో మల్టీస్పెషలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.వంశీని రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించండని, కార్మికుల కోసం కాకా ఎంతో చేశారని అన్నారు. స్పీకర్ పదవికే శ్రీపాద రావు వన్నె తెచ్చారని ,విలువలతో కూడుకున్న రాజకీయం చేశారని గుర్తు చేశారు. కొప్పుల ఈశ్వర్ కు ఓటు అడిగే నైతక హక్కు లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.