కొడంగల్‌లో ‘కారు’కు రేవంత్ దెబ్బ..కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే!

-

గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని దెబ్బకొడుతూ..కొడంగల్ స్థానాన్ని బి‌ఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా పక్కా వ్యూహాలతో ముందుకెళ్లి..కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించారు. అయితే ఈ సారి సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తుంది. కొడంగల్ లో నిదానంగా రేవంత్ రెడ్డి బలం పెరుగుతుంటే..అక్కడ బి‌ఆర్‌ఎస్ బలం తగ్గుతూ వస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పనితీరు అంతగా బాగోలేదనే తెలుస్తోంది. దీంతో ఆయనపై నెగిటివ్ కనిపిస్తుంది.

ఈ క్రమంలోనే అక్కడ అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి బి‌ఆర్‌ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయ్యారు. గతంలో గురునాథ్ రెడ్డి కొడంగల్ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచిన ఆయన, 1983, 1989, 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఇక 2009 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి టి‌డి‌పి నుంచి పోటీ చేసి గురునాథ్‌ని ఓడించారు. 2014 ఎన్నికల్లో కూడా రేవంత్ టి‌డి‌పి నుంచి పోటీ చేయగా, గురునాథ్ బి‌ఆర్‌ఎస్ లోకి వెల్లి పోటీ చేశారు. అప్పుడు రేవంత్ పై చేయి సాధించారు.

కానీ 2018 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ సీటు గురునాథ్‌కు దక్కలేదు. పట్నం నరేందర్ రెడ్డికి ఇచ్చారు. ఇక పట్నం గెలిచాక గురునాథ్ కు పార్టీలో ప్రాధాన్యత లేదు. దీంతో ఎప్పటినుంచో అసంతృప్తిగా ఉంటున్న గురునాథ్ రెడ్డి..తాజాగా కొడంగల్ కు వచ్చిన రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అటు రేవంత్‌తో కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు.

ఇలా ఒకేసారి ఇద్దరు కీలక నేతలు రేవంత్‌ని కలవడంతో బి‌ఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలినట్లు అయింది. త్వరలోనే గురునాథ్ రెడ్డి కాంగ్రెస్స్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. గురునాథ్ కాంగ్రెస్ లోకి వస్తే కొడంగల్ లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చినట్లే.

Read more RELATED
Recommended to you

Exit mobile version