ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్‌ బహిరంగ సభ

-

ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జిల్లాల బాట పట్టనున్నారు. ఈనెల 12 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. ఈనెల 12న కొత్తగూడెం, మహబూబాబాద్‌ కలెక్టరేట్లను సీఎం ప్రారంభించనున్నారు . 18న ఖమ్మం కలెక్టరేట్‌ శ్రీకారానికి ముహూర్తం ఖరారైంది. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎంవో నుంచి అధికారిక సమాచారం అందింది. 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యం సంతరించుకోనుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్న తరుణంలో సీఎం పర్యటన ఆసక్తి రేపుతోంది. ఈనెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news