కేంద్ర బడ్జెట్: నేడు కేంద్ర క్యాబినెట్ కీలక భేటీ

-

కేంద్ర బడ్జెట్ పై దేశ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సామాన్యుడితో పాటు కార్పోరేట్ల వరకు తమకు నిర్మలమ్మ బడ్జెట్ ఏ వరాలు కురిపిస్తుందో అని చూస్తున్నారు. అయితే దీని కన్నా ముందు కేంద్ర క్యాబినెట్ కీలక భేటీ జరుగనుంది. ఆరోజు ఉదయం 10.10 గంటలకు కేంద్ర క్యాబినెట్ భేటీ జరుగనుంది. నేడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించనుంది. ఆ తరువాత ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.

గత రెండేళ్లుగా కరోనా కారణంగా దేశఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులు లోనైంది. అన్ని వర్గాల ప్రజలపై కరోనా ప్రభావం పడింది. దీంతో అన్ని రంగాలు, అన్ని వర్గాల ప్రజలు బడ్జెట్ పై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా దేశంలో ఎక్కవమంది ఆధారపడిన వ్యవసాయ రంగానికి ఎలాంటి వరాలు కురిపిస్తారో అని వేచిచూస్తున్నారు. మరోవైపు వేతనజీవులకు ఊరట కలిగించే నిర్ణయాలు ఉంటాయా..అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version