కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు బీజేపీకి సంబంధం ఏమిటీ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షు రాలు డీకే అరుణ ప్రశ్నించింది. కులాలు, మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టేది టీఆర్ఎస్ పార్టీయే అని మండిపడ్డారు. మునవార్ ఫారూఖి లాంటి హిందూ సంస్కృతిని వ్యతిరేకించే వారిని స్వాగతించే మీది ఏ సంస్కృతి అని ప్రశ్నించారు. కేసీఆర్ ది ఓట్ల రాజకీయం అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచే అభివృద్ధి అయి ఉందని అన్నారు.
కేసీఆర్ వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. కానీ చాలా దేశాల్లో జీడీపీ పడిపోయినా.. మన దేశంలో జీడీపీ పెరిగిందని అని అన్నారు. కేసీఆర్ మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని దేశాన్ని, అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉందని అన్నారు. దేశంలో నిరుద్యోగంలో తెలంగాణ రాష్ట్రం 6వ స్థానంలో ఉందని తెలిపారు. ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ కంటే తెలంగాణలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉందని అన్నారు. దీనికి కారణం కేసీఆర్ కాదా.. అని అన్నారు.