రూ.165 పొదుపుతో.. ప్రతి నెలా రూ.20 వేలు..!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. దీనితో మంచిగా డబ్బులు వస్తాయి. పైగా ఇతర ప్రయోజనాలను కూడా పొందొచ్చు. అయితే పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలనుకుంటే ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మంచిది. రిటైర్మెంట్ తర్వాత సమస్యలు లేకుండా ఉండచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ ని తీసుకు వచ్చింది. అందువల్ల మీ డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఇందులో చేరిన వారు 60 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉండచ్చు. తర్వాత ఒకేసారి భారీ మొత్తం పొందొచ్చు. పైగా ఈ స్కీమ్ ద్వారా ప్రతీ నెలా కూడా పెన్షన్ వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా ఈ స్కీమ్ తో పొందొచ్చు.

ఎన్‌పీఎస్ ఇన్వెస్ట్‌మెంట్లపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద రూ.50 వేల వరకు పన్ను తగ్గింపు పొందడానికి అవుతుంది. 80సీ కింద కూడా ఈ స్కీమ్‌పై పన్ను మినహాయింపు లభిస్తోంది. ఇక ఈ స్కీమ్ కి ఎవరు అర్హులు అన్నది చూస్తే.. 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. 60 ఏళ్ల వరకు డబ్బులు పెట్టిన తర్వాత మెచ్యూరిటీ సమయంలో మీరు 60 శాతం డబ్బులను విత్‌డ్రా చెయ్యచ్చు.

40 శాతం మొత్తంతో యాన్యుటీ ప్లాన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఈ స్కీమ్ ద్వారా డబ్బులు ఎలా వస్తాయి అనేది చూస్తే… మీకు 30 ఏళ్లు వున్నాయి అనుకుంటే ప్రతి నెలా రూ.5 వేలు ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో మొత్తంగా రూ.1.13 కోట్లు వస్తాయి. ఇందులో 60 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 40 శాతంతో పెన్షన్ ప్లాన్ తీసుకోవాలి. యాన్యుటీ ప్లాన్‌లో రూ.45 లక్షలు పెట్టాలి. చేతికి రూ.65 లక్షలకు పైగా వస్తాయి. వార్షిక రాబడిని 10 శాతంగా పరిగణలోకి తీసుకుంటే యాన్యుటీ ప్లాన్ ద్వారా నెలకు రూ.22 వేలు లభిస్తాయి. రోజు రూ.165 పొదుపుతో రూ.22 వేలు లభిస్తాయి. యాన్యుటీ రేటును 6 శాతంగా పరిగణించాం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version