పెళ్లి తరవాత ఈ అకౌంట్ తెరిస్తే.. రూ.5 వేలు నెల నెలా..!

-

ఈ మధ్య చాలా మంది ఎవరికి నచ్చిన స్కీమ్స్ లో వాళ్ళు డబ్బులు పెడుతున్నారు. ఈ స్కీమ్స్ లో చేరడం వలన మంచిగా డబ్బుల్ని పొందొచ్చు. అయితే మీరు కూడా ప్రతీ నెలా డబ్బులని పొందాలనుకుంటున్నారా..? పెళ్లి అయ్యిందా..? అయితే మీరు దీని కోసం చూడాల్సిందే. పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన మంచిగా డబ్బులు వస్తాయి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఆకర్షణీయ రాబడిని ఈ స్కీమ్ లో చేరి పొందొచ్చు. ఇందులో చేరడం వలన ప్రతి నెలా చేతికి డబ్బులు కూడా వస్తాయి. పైగా ఏ రిస్క్ కూడా ఉండదు. పోస్టాఫీస్ అందిస్తోన్న పలు రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మంత్లీ ఇన్‌మక్ స్కీమ్ కూడా ఒకటి. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో డబ్బులు పెడితే 6.6 శాతం వడ్డీ రేటును పొందొచ్చు. ఈ వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి.

లేదంటే స్థిరంగా కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ పోస్టాఫీస్ మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లో మీరు రూ.1000 నుంచి కూడా డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యచ్చు. మాక్సిమం రూ. 4.5 లక్షల వరకు ఇందులో పెట్టచ్చు. ఇది సింగిల్ అకౌంట్ కి. అదే ఒకవేళ మీకు పెళ్ళైతే మీరు జాయింట్ అకౌంట్ తెరిస్తే అప్పుడు ఈ స్కీమ్ లో మీరు రూ. 9 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు.

ఇలా మీరు ఇన్వెస్ట్‌ చేసిన డబ్బులపై వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ డబ్బులను ప్రతి నెలా చెల్లిస్తారు. అందువల్ల మీకు ప్రతి నెలా డబ్బులు వస్తాయి. గ్యారంటీ ఉంటుంది. రూ.9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు దాదాపు రూ.5 వేల వరకు వస్తాయి. ఎవరైనా ఇందులో చేరచ్చు. పదేళ్లకు పైన వయసు కలిగిన వారు వారి పేరుపై ఖాతా ఓపెన్ చేయొచ్చు. తక్కువ వయసు ఉంటే గార్డియన్ ఉండాలి. కావాలంటే ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఈ స్కీమ్ లో చేరచ్చు. స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. అంటే మీ డబ్బులు ఐదేళ్ల వరకు అలానే ఉంటాయి. తరవాత వాటిని ఇస్తారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version