ఎన్నికలకు ముందు మరియు ఎన్నికల తర్వాత సర్వేల పేరుతో స్థానిక సంస్థలు మరియు జాతీయ సంస్థలు ఫలితాలను ప్రకటిస్తూ ఉంటాయి. కానీ ఈ సర్వేలలో అన్ని చెప్పినట్లు జరుగుతాయని గ్యారంటీ లేదు. ప్రజలు తమ నిర్ణయాన్ని ఎప్పుడు ఎలాగైనా మార్చుకునే హక్కు వారికీ ఉంది. అయితే సర్వేల సమయంలో వారు చెప్పిన నిర్ణయం పైన నిలబడకపోవచ్చు, అంటే సర్వేలో మాత్రం ఒక పార్టీకి అనుకూలంగా చెప్పి .. ఓటు మాత్రం వేరే పార్టీకి వేయవచ్చు. అందుకే ప్రజలకు ఆయా పార్టీలు చెప్పే హామీలు, మానిఫెస్టోలో కీలకంగా మారుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తాజాగా లోక్ పాల్ సర్వే తెలంగాణాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఏ ఉంటాయన్నది ఒక సర్వే ను చేశారు. ఇందుకు సంబంధించిన ఫలితాలలో మళ్ళీ తెలంగాణాలో కేసీఆర్ పార్టీ గెలుస్తుందని చెప్పడం జరిగింది.
అయితే కేవలం సర్వేలు మాత్రమే రాజకీయ పార్టీలను ఎన్నికల్లో గెలిపించలేవు అన్న విషయాన్నీ ప్రముఖులు అర్ధం చేసుకోవాలి.