ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాలను దాదాపు రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. కరోనా corona కంగారుతో ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతూ ప్రజలు జీవిస్తున్నారు. అసలు కరోనా కంగారు ఎప్పుడు పూర్తిగా సమసిపోతుందా? అని ఎదురుచూస్తున్నారు. కానీ ఏళ్లుగా కరోనా తన రూపాలను మార్చుకుంటూ మన మీద దాడి చేస్తూనే ఉంది. కరోనా నుంచి కోలుకున్నాక కూడా అనేక సమస్యలతో సతమతం కావాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినా కానీ కొంత మంది తీరు మార్చుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనాకు బలవుతున్నారు.
సాధారణంగా కరోనా సోకిన తర్వాత ఎవరికైనా తెలుస్తుంది. కానీ ప్రస్తుతం కళ్లను చూసి కరోనా ను చెప్పే విధానాన్ని శాస్త్రవేత్తలు అవలంభిస్తున్నారు. కళ్లను చూసి మీరు లాంగ్ కోవిడ్ తో బాధపడుతున్నారా? లేక త్వరగా నయమయే కోవిడ్ మీకు సోకిందా అనే విషయాన్ని చెప్పేస్తారు . వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.
టర్కీ కి చెందిన ఎర్బాకన్ అనే యూనివర్సిటీ పరిశోధకులు మన కంటిలోని కార్నియాలో నెర్వ్ డ్యామేజ్ చూసి కోవిడ్ గురించిన సమాచారం చెప్పేస్తున్నారు. ఇలా కార్నియాను చూసి కోవిడ్ గురించి చెప్పే విధానాన్ని కార్నియల్ కాన్ ఫోకల్ మైక్రోస్కోపీ అని అంటారు. ఇది ఏదో తమాషాకు చెప్పలేదు. శాస్త్రవేత్తలు కూడా పూర్తిగా శాస్త్రీయంగా పరిశోధించిన తర్వాతే వివరాలు వెల్లడించారు. పరిశోధనల కోసం కరోనా సోకిన 40మందిని, ఆరోగ్యంగా ఉన్న 30మందికి పరీక్షలు జరపగా.. ఈ విధానం గురించి బయట పడింది. ఇలా కళ్లను చూసి మన కార్నియాలో ఉన్న నరాల కదలికలతో లాంగ్ కోవిడ్ తో బాధపడుతున్నారా లేదా అనే విషయాన్ని ఇట్టే చెప్పేయవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు.