సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన చిత్రం ‘కేరింత’. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో శ్రీ దివ్య మెయిన్ హీరోయిన్ అయినా.. మరోనటి సుకృతి తన యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకుంది. సుకృతి పేరు అంటే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు.. కానీ ఆ సినిమాలో ‘భావన’ అనే పాత్ర అందరికీ గుర్తుకు ఉండే ఉంటుంది. భావన పాత్ర కేరింత సినిమాకే ప్లస్ అయింది. ఆ తర్వాత ఆమె తన వ్యక్తిగత కారణాల వల్ల పెద్దగా సినిమాలు చేయలేదు. అయితే సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు.
అయితే ఆమెకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతోంది. సుకృతి త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. అక్షయ్ సింగ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పలువురు సినీ నటులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి.. తన తండ్రి గురించి ఓ ఎమోషన్ పోస్ట్ చేసింది. ‘ఎప్పటికీ నువ్వే నా ఫస్ట్ లవ్ డాడీ’ అని పేర్కొంది.