హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ మోహన రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పించేందుకు సీబీఐ మరోసారి సమయం కోరింది. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది.
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. జగన్ బెయిల్ రద్దు సంబంధించి లిఖిత పూర్వకంగా వాదనలు ఇవ్వాలని సీబీఐ కోర్టు ఇప్పటికే తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా కూడా విచారణ జరిగింది. మళ్లీ సమయం కోరడంతో విచారణను కోర్టు వాయిదా వేసింది. ఏపీ సీఎంగా జగన్ ఉండటం వల్ల పదే పదే బెయిల్ కండీషన్‌ను ఉల్లంఘిస్తున్నారని, అటు సీబీఐ అధికారులు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పడంలేదని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే పలుమార్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.