సీబీఐ విచారణతో వాస్తవాలేంటో తెలుస్తాయి :మంత్రి కాకాణి

-

ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్న ఫోర్జరీ కేసుకి సంబందించిన నకిలీ పత్రాల కేసులో నెల్లూరు 4వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి గదిలో నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో దొంగతనమైన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో, నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు… కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తున్నట్టు తెలిపింది. దీనిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. . హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. సీబీఐ విచారణ కోరుతూ తానే అఫిడవిట్ దాఖలు చేశానని వెల్లడించారు.

Kakani Govardhan Reddy Archives - idhatri

కోర్టు తన విజ్ఞప్తిని మన్నించిందని తెలిపారు. తనపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని, ఇప్పుడు సీబీఐ విచారణతో వాస్తవాలేంటో అందరికీ తెలుస్తాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబులాగా తాను విచారణ నుంచి తప్పించుకోవాలని అనుకోవడంలేదని ఆయన వ్యక్తం చేశారు. చంద్రబాబుపై అనేక కేసులు ఉన్నాయని, ఆయన లాగా స్టేలు తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్యం తనకు పట్టలేదన్నారు. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆరోపణలు వచ్చినా విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కాకాణి అభిప్రాయపడ్డారు. కోర్టు నుంచి కీలక ఆధారాలు మాయం కావడం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news