సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల మార్కింగ్‌ పాలసీ ప్రకటన.. ఫలితాల విడుదల అప్పుడే..!

-

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే విద్యార్థులకు మార్కులను నిర్ణయించే విధానాన్ని ప్రకటిస్తామని సీబీఎస్‌ఈ తెలిపింది. అందులో భాగంగానే సీబీఎస్‌ఐ మార్కుల కేటాయింపుకు అనుసరించే విధానాన్ని ప్రకటించింది. విద్యార్థులకు అకాడమిక్‌ ఇయర్‌లో నిర్వహించిన ఎగ్జామ్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్‌ పరీక్షల మార్కులను వెల్లడించనున్నారు. ఈ మేరకు సీబీఎస్‌ఈ ఒక ప్రకటన విడుదల చేసింది.

మొత్తం 100 మార్కుల్లో 80 మార్కులను అకాడమిక్‌ ఇయర్‌లో నిర్వహించిన పరీక్షల మార్కుల ఆధారంగా కేటాయిస్తారు. ఇక మిగలిన 20 మార్కులను ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా ఇస్తారు. అయితే విద్యార్థులకు మార్కులను కేటాయించే విషయంలో పాఠశాలలు రిజల్ట్‌ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. అందులో స్కూల్‌ ప్రిన్సిపాల్‌, స్కూల్‌కు చెందిన 5 మంది టీచర్లు, ఇతర స్కూల్‌కు చెందిన ఇద్దరు టీచర్లు సభ్యులుగా ఉండాలి. వారు విద్యార్థుల మార్కులను అసెస్‌ చేసి వారికి మార్కులను ఇవ్వాలి. ప్రతి స్కూల్‌ మార్కులను ఇచ్చేందుకు ఈ విధానాన్నే అనుసరించాల్సి ఉంటుంది.

ఇక స్కూల్‌లో నిర్వహించిన టెస్టులకు హాజరు కాని విద్యార్థులకు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్షలను నిర్వహించి స్కూల్స్‌ మార్కులను కేటాయించాల్సి ఉంటుంది. అలాగే స్కూల్‌లో నిర్వహించే ఇతర యాక్టివిటీలలో వచ్చిన మార్కుల ఆధారంగా కూడా విద్యార్థులకు మార్కులను ఇవ్వవచ్చు. ఇక ఎగ్జామ్స్‌లో మినిమం మార్కులు కూడా రాని వారికి సీబీఎస్‌ఈ బోర్డు గ్రేస్‌ మార్క్‌లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలను జూన్‌ 20వ తేదీన వెల్లడించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version