కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాల కంటే కేంద్రం చర్చకు ముందుకు రావాలన్నారు ఖమ్మం టిఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు. సభ నుంచి పారిపోయే ప్రయత్నం చేయవద్దన్నారు. తెలంగాణ బడ్జెట్ రైతులు , పేదల బడ్జెట్ అని.. కేంద్ర బడ్జెట్ రైతు వ్యతిరేక బడ్జెట్ అని అన్నారు. విద్య , వైద్యానికి రాష్ట్ర బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.
దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంటే , తెలంగాణ లో ప్రతి సంవత్సరం వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించకపోయినా , రాష్ట్రం తనకున్న వనరులతో అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందన్నారు నామా నాగేశ్వరరావు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి విషయంలో కేంద్రం అనవసర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా కేంద్రం తెలంగాణ కు సహకరించాలని కోరారు.