ఉద్యోగులకి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎంప్లాయీస్‌కు శుభవార్త ని తీసుకు వచ్చేలానే కనపడుతోంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్ళీ గుడ్ న్యూస్ ని అందించేలానే వుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. కేంద్ర ప్రభుత్వం జూలై డిసెంబర్ కాలానికి కూడా డియర్‌నెస్ అలవెన్స్ ని పెంచాల్సి ఉంది. ప్రతీ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు సార్లు డీఏ ని పెంచుతుంది. కనుక ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచవచ్చు అని తెలుస్తోంది.
ఇప్పుడూ రెండో అర్ధ భాగానికి డీఏ పెంచాల్సి వుంది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్ బ్యూరో విడుదల చేసే ఆల్ ఇండియా సీపీఐ ఐడబ్ల్యూ ని బట్టీ డీఏ పెంపును నిర్ణయిస్తారు. డీఏ పెంపు ఆధారంగా ఉద్యోగుల వేతనాల్లో పెరుగుదల అనేది వుంది అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది రెండో అర్ధ భాగానికి కూడా డియర్‌నెస్ అలవెన్స్‌ను 3 శాతం మేర పెంచవచ్చని. కేంద్రం పెంచే ఛాన్స్ ఉందని నివేదికలు ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం డీఏ 42 శాతంగా ఉంది. ఒకవేళ పెంచితే అప్పుడు డీఏ 45 శాతానికి చేరొచ్చు.
డియర్‌నెస్ అలవెన్స్ 3 శాతం పెరిగితే అప్పుడు ఉద్యోగుల వేతనాల్లో కూడా పెరుగుదల ఉంటుంది. చాలా మందికి ఊరట ఉంటుంది. డీఏ పెరిగితే డీఆర్ కూడా పెరుగుతుంది. డీఏ పెంపు ప్రకటన రెండో అర్ధ భాగం లోనే ఉంటుంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెల లో కేంద్ర ప్రభుత్వం డీఏ ని పెంచవచ్చు. ఇది జూలై నుంచి అమలు లోకి వస్తుంది. అంటే జూలై నుంచి ఉద్యోగుల శాలరీ పెరగొచ్చు. కోవిడ్ 19 కారణంగా డీఏను మూడు సార్లు పెంచని విషయం తెలిసిందే. పెండింగ్‌లో ఉన్న డీఏను అరియర్స్ రూపంలో ఇవ్వలేమని కూడా ప్రభుత్వం చెప్పేసింది. కరోనా వల్ల ఆర్థికంగా చాలా భారం పడినట్టు కేంద్రం చెప్పింది.