మోడీని ఇక్కడ కేసీఆర్ తిడతాడు.. ఢిల్లీలో కలుస్తాడు: చామల కిరణ్ కుమార్

-

కేసీఆర్ ఇక్కడ మోడీని తిట్టి ఢిల్లీలో కలుస్తాడని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి తో కలిసి మార్నింగ్ వాకర్స్ తో ఆదివారం చిట్ చాట్ ని నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రముఖ టౌన్షిప్ అభ్యుదయ నగర్ కాలనీ ఇలా పలు కాలనీలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు కాలనీలో ఉన్నటువంటి సమస్యల్ని వివరించారు.

ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి చామల మాట్లాడుతూ కేసీఆర్ కి చిత్తశుద్ధి లేదు అన్నారు లౌక్యం ఉందో లేదో కూడా నాకు తెలియదు అన్నారు. మోడీ ని తిట్టినట్లు నటిస్తాడు అని శ్యామల అన్నారు. విభజన హామీల ప్రకారం రావాల్సిన నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకోవచ్చు కానీ అవి ఏమీ పట్టించుకోకుండా కాలేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద పెట్టలేదు అన్నారు డ్రైనేజీ సమస్య తీవ్రంగా వేధిస్తోందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version