దద్దరిల్లిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబు, సీఐడీ న్యాయవాదుల మధ్య మాటల యుద్ధం

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ రికార్డుపై ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. సీఐడీ తరపు న్యాయవాదులకు, చంద్రబాబు తరపు న్యాయవాదులకు మద్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. న్యాయవాదుల తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే విచారణ నిలిపి వేస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు హాలులో అరుచుకున్న న్యాయవాదుల వివరాలు రికార్డు చేయాలని జడ్జి ఆదేశించారు. వివాదాలతో ఉంటే ఈ కేసు విచారణ తాను చేయలేనని న్యాయమూర్తి బెంచ్ దిగి వెళ్లిపోయారు. కేసు విచారణ వాయిదా పడింది.

సీఐడీ అధికారుల కాల్ డేటా ఇవ్వాలంటూ టీడీపీ వర్గాలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ రోజు ఏసీబీ కోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషన్ వేసి నెల రోజులైందని, త్వరగా విచారించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ అన్నారు. అసలు ఈ పిటిషన్ అనర్హమైనదని సీఐడీ తరఫు న్యాయవాది వివేకానంద వాదించారు. ఈ క్రమంలో ఇరువైపుల న్యాయవాదుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వారిపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version