సూపర్ స్టార్ కృష్ణ 1961లో వచ్చిన కులగోత్రాలు సినిమాతో నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. పదండి ముందుకు, పరువు ప్రతిష్ట సినిమాల్లో చిన్న పాత్రలతో యాక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత 1965లో తేనె మనసులు చిత్రంలో హీరోగా అవకాశం దక్కింది. అయితే.. సూపర్ స్టార్ కృష్ణ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు అన్నారు. ఆయన ఇక లేరన్న వార్త తనను కలచివేసిందన్నారు చంద్రబాబు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్‌గా అభిమానులతో పిలిపించుకున్న ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటని అన్నారు చంద్రబాబు.
నటుడిగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాతగా కృష్ణను చెప్పుకుంటారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. టాలీవుడ్ జేమ్స్ బాండ్‌గా, విలక్షణ నటుడిగా పేరున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణగారి మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసిందన్నారు. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కోల్పోయిన మహేష్ బాబుకు ఇది తీరని వేదన మిగిల్చిందన్నారు. ఈ బాధ నుంచి మహేశ్ బాబు త్వరగా కోలుకునే ధైర్యాన్ని భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని కోరుకున్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు చంద్రబాబు.