సీఎస్‌ సమీర్‌ శర్మకు చంద్రబాబు లేఖ

-

గత శనివారం చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన జాలర్లను బోటులోని ఇంజన్‌లోకి నీరు వచ్చి చేరడంతో సముద్రంలో చిక్కుకుపోయినట్లు సమాచారం అందించారు. అయితే అప్పటినుంచి వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు మెరైన్‌ పోలీసులు, నేవీ అధికారులు సైతం సర్చ్‌ ఆపరేషన్‌ను చేపట్టారు. ఈ క్రమంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మచిలీపట్నానికి చెందిన నలుగురు జాలర్ల ఆచూకీ కనిపెట్టాలని సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

వేటకెళ్లిన నలుగురు బందరు జాలర్లు గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. మత్స్యకారుల ఆచూకీ కనిపెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అవసరమైతే లాంగ్‌ రేంజ్‌ డ్రోన్‌లతో గాలించాలన్నారు. నాలుగు రోజులైనా ప్రభుత్వ యంత్రాంగం నుంచి సరైన స్పందన లేదని, రెండు రోజుల క్రితం స్థానిక మత్స్యకారులు రెండు బోట్లు వేసుకుని సముద్రంలో గల్లంతయిన జాలర్ల కోసం గాలించినా ఉపయోగం లేకపోయిందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version